ICET: మే 7న ఐసెట్ ప్రవేశ పరీక్ష...! 16 d ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ సెట్ కన్వీనర్ తెలిపారు. దరఖాస్తులను రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ. 10 వేల అపరాధ రుసుంతో మే 28 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో అవకాశం కల్పించారు. మే 7న పరీక్ష ఉంటుందని, అదే నెల 2 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.